Please enable javascript.LIC HFL Recruitment 2020,LIC HFL: ఎల్ఐసీ‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌‌లో ఐటీ జాబ్స్‌.. ఏడాదికి రూ.14 లక్షల వరకూ జీతం - lic hfl recruitment 2020 for 20 management trainee assistant manager posts apply online at lichousing com - Samayam Telugu

LIC HFL: ఎల్ఐసీ‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌‌లో ఐటీ జాబ్స్‌.. ఏడాదికి రూ.14 లక్షల వరకూ జీతం

Samayam Telugu 19 Dec 2020, 6:41 pm
Subscribe

ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌.. 20 ఐటీ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎల్ఐసీ‌ హౌసింగ్‌ ఫైనాన్స్
ముంబ‌యిలోని ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‌(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌).. 20 ఐటీ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందులో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 31 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మేనేజ్‌మెంట్ ట్రెయినీకి నెల‌కు రూ.25,000, అసిస్టెంట్ మేనేజ‌ర్ల‌కు ఏడాదికి 10 నుంచి 14 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు https://www.lichousing.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

దరఖాస్తుకు డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్‌ చేయండి:

మొత్తం ఖాళీలు: 20
1) మేనేజ్‌మెంట్ ట్రెయినీ- 09 పోస్టులు
2) అసిస్టెంట్ మేనేజర్ ‌(ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఇంజినీర్‌, వెబ్‌,డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌, మొబైల్ యాప్ డెవ‌ల‌ప‌ర్,గ్రాఫిక్స్ డిజైన‌ర్)- 11 పోస్టులు.

ముఖ్య సమాచారం:
  • అర్హ‌త‌: మేనేజ్‌మెంట్ ట్రెయినీ: క‌నీసం 60% మార్కుల‌తో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ సబ్జెక్టుల‌తో ఫుల్ టైం ఎంసీఏ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణ‌తతో పాటు సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి. దూర విద్యా, పార్ట్ టైం డిగ్రీలు, క‌ర‌స్పాండెన్స్ డిగ్రీలు అంగీకరించ‌బ‌డ‌వు.
  • వ‌య‌సు: 01.12.2020 నాటికి 24-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజ‌ర్‌: క‌నీసం 60% మార్కుల‌తో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ సబ్జెక్టుల‌తో ఫుల్ టైం ఎంసీఏ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణ‌తతో పాటు సంబంధిత ప‌నిలో మూడేళ్ల‌అనుభ‌వం ఉండాలి. దూర విద్యా, పార్ట్ టైం డిగ్రీలు, క‌ర‌స్పాండెన్స్ డిగ్రీలు అంగీకరించ‌బ‌డ‌వు.
  • వ‌య‌సు: 01.12.2020 నాటికి 25-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: ద‌ర‌ఖాస్తుల ద్వారా అర్హులైన అభ్య‌ర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్ టెక్నిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష 50 మార్కుల‌కు ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో మెరిట్ మార్కులు సాధించిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. దీన్ని ముంబ‌యిలో నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ టెక్నిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కుల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకొని తుది ఎంపిక చేస్తారు.
  • జీతం: మేనేజ్‌మెంట్ ట్రెయినీకి నెల‌కు రూ.25,000, అసిస్టెంట్ మేనేజ‌ర్ల‌కు ఏడాదికి 10 నుంచి 14 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లిస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 31,2020.
  • వెబ్‌సైట్‌: https://www.lichousing.com/

నోటిఫికేషన్‌:

lichfl-19-12-2020

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.