యాప్నగరం

హోదా బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్

ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ తో పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ భేటీ అయ్యారు.

TNN 19 Jul 2016, 1:26 pm
ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు జూలై 22న చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమై ఉంది. దీనిపై చర్చించేందుకు మంగళవారం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మిగతా పార్టీల నుంచి మద్దతు ఎలా కూడగట్టాలన్న అంశంపై మంతనాలు జరిపారు. దీనిపై చర్చ తర్వాత ఓటింగ్ కు పట్టుబట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్ నిర్వహిస్తే బీజేపీ, టీడీపీలకు ఇరుకున పెట్టవచ్చనే వ్యహంలో కాంగ్రెస్ ఉంది. కాగా బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ,బీజేపీలు ఎలా స్పందిస్తాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.