యాప్నగరం

ఆలయంలో పూజలు చేస్తూ అర్చకుడు మృతి

అర్చకుడు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. పూజలు నిర్వహించిన తర్వాత.. స్వామి మెడలో తులసి మాల కూడా వేశాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. ఆంజనేయుడి ముందే ఒరిగి కిందపడిపోయాడు.

Samayam Telugu 29 Jan 2019, 11:59 am

ప్రధానాంశాలు:

  • కిందపడిన వెంటనే ఆస్పత్రికి తరలించారు
  • ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు
  • అర్చకుడి మృతితో కుటుంబంలో విషాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఆలయంలో పూజలు చేసే అర్చకుడు ఆ దేవుడి పాదాల చెంతే కిందపడిపోయాడు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి.. విగ్రహం దగ్గర నుంచి జారిపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. చివరికి ఆ దేవుడి దగ్గరకే చేరాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీడియో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని నమ్మకల్‌లోని ఆలయంలో ఆదివారం ఓ అర్చకుడు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. పూజలు నిర్వహించిన తర్వాత.. స్వామి మెడలో తులసి మాల కూడా వేశాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. ఆంజనేయుడి ముందే ఒరిగి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి అర్చకులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

పై నుంచి కిందపడిపోవడంతో అతడికి తీవ్ర గాయాలుకాగా.. అతడికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కాని చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. పాపం అర్చకుడి మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.