యాప్నగరం

బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ.. ఢిల్లీ టార్గెట్ 163

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని మిడిలార్డర్ బలహీనత మరోసారి వెంటాడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన హైదరాబాద్ కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని 162కే పరిమితమైంది.

Samayam Telugu 29 Sep 2020, 9:46 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు అంచనాల్ని అందుకోలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో (53: 48 బంతుల్లో 2x4, 1x6) నెమ్మది హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడ, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Samayam Telugu Jonny Bairstow (Photo Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (45: 33 బంతుల్లో 3x4, 2x6), జానీ బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సాధారణంగా దూకుడుగా ఆడే ఈ జోడీ.. గత రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌ చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్‌లో అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కి 9.3 ఓవర్లలో 77 పరుగుల భాగస్వామ్యం నమోదవగా.. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి వార్నర్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే (3: 5 బంతుల్లో) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోడంతో.. బెయిర్‌స్టో మరింత నెమ్మదించాడు. అయితే.. చివర్లో కేన్ విలియమ్సన్ (41: 26 బంతుల్లో 5x4), అబ్దుల్ సమాద్ (12 నాటౌట్: 7 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ 162 పరుగులైనా చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.