యాప్నగరం

రోహిత్ సూపర్ ఫిట్ అంటూనే.. మెలిక పెట్టిన బీసీసీఐ

IPL 2020 సందర్భంగా గాయపడిన రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. అతడు ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్తాడని తెలిపింది.

Samayam Telugu 12 Dec 2020, 4:14 pm
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయమై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. శుక్రవారం ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పూర్తి ఫిట్‌‌గా ఉన్నాడని తేలిందని బోర్డు ప్రకటించింది. హిట్ మ్యాన్ ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్తాడని ప్రకటించిన బోర్డు.. 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంటాడని తెలిపింది. ఆ తర్వాతే జట్టు సభ్యులతో కలుస్తాడని చెప్పింది. డిసెంబర్ 17న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu Rohit sharma


ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ.. ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేశాడని ప్రకటించిన బీసీసీఐ.. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు వెల్లడించింది. హై గ్రేడ్ హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురైన రోహిత్.. నవంబర్ 19 నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్, ట్రైనింగ్ పొందినట్లు తెలిపింది.

బ్యాటింగ్ స్కిల్స్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరిగెత్తడం.. తదితర అంశాళ్లో రోహిత్‌ను పరీక్షించినట్లు.. అతడి ఫిజికల్ ఫిట్‌నెస్ సంతృప్తికరంగా ఉందని బీసీసీఐ తెలిపింది. కానీ అతడింకా శ్రమించాల్సి ఉందని పేర్కొంది. క్వారంటైన్లో ఉండబోయే 14 రోజులపాటు రోహిత్ ఏమేం చేయాలనేది బీసీసీఐ మెడికల్ టలీం పూర్తి వివరాలను అందజేయనుందన్నారు. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత రోహిత్‌ను తిరిగి పరీక్షించనున్నారు. అప్పుడు కూడా ఫిట్‌గా ఉన్నాడని తేలితేనే టెస్టు జట్టులో అతడి పేరును చేరుస్తారు. డిసెంబర్ 13న హిట్ మ్యాన్ ఆసీస్ బయల్దేరి వెళ్లే అవకాశం ఉంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.