యాప్నగరం

తాగి రోడ్డుపై పడ్డ వ్యక్తి... కాపాడబోయి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

బస్సు నందిగామ ప్రభుత్వాసుపత్రి వద్ద రాగానే.. ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై బస్సును తప్పించాడు. దీంతో బస్సు వెళ్లి గుంతలో పడింది.

Samayam Telugu 28 Oct 2020, 7:30 am
ఓ వ్యక్తిని కాపాడబోయి ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. అదృష్టవశాత్తు డ్రైవర్ అప్రమత్తంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలో చోటు చుసుకుంది. వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు గుంతలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన బస్సు న TS06-Z-0204నెంబర్ కలిగిన షాద్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే హైదరాబాదు నుండి కొత్తూరు,నందిగామ మీదుగా పాత NH-44 జాతీయ రహదారి గుండా సుమారుగా బస్సు షాద్‌నగర్‌కు బయల్దేరింది. బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు.
Samayam Telugu ఆర్టీసీ బస్సు ప్రమాదం
rtc bus accident


Read More: బావి నుంచి జీపు వెలికితీత.. ఇంకా చిక్కని మరో 3 మృత దేహాలు

అయితే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో రాగానే తాగిన మైకంలో రోడ్డుపై పడిన వ్యక్తిని బస్సు డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యక్తిని తప్పించాడు. అయితే ఈ క్రమంలో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో గుంతలో ఉన్న ఆర్టీసీ బస్సును జెసిబి సహాయంతో తీసే క్రమంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారుగా ఐదు కిలోమీటర్ల మేరకు 2 గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు వాహనదారులు దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.