యాప్నగరం

ముద్దులన్నీ నాకే పెట్టేస్తే నీ బాయ్ ఫ్రెండ్‌కి ఏం ఇస్తావ్.. హారికతో అవినాష్ రొమాంటిక్ టాక్

బిగ్ బాస్ సీజన్ 4 గురువారం నాటితో 26 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని శుక్రవారం నాడు 27వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..

Samayam Telugu 2 Oct 2020, 10:51 pm
బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా కుమార్ సాయి ఎంపిక అయ్యాడు. పోటుగాళ్లు మాదిరి బిల్డప్ ఇచ్చి.. చేతకాదంటూ నిందిస్తూ అతడు పనికి రాడని వరుసగా నామినేట్ చేస్తూ వస్తున్న ఇంటి సభ్యులే కుమార్ సాయి విజయాన్ని స్వాగతించారు. నిందించిన నోళ్లే కమాన్ కుమార్ అని పొగడ్తలు కురిపించాయి. ఇక ఓటమి భారంతో రాజ శేఖర్ మాస్టర్ ఫ్రస్ట్రేషన్ అవుతూ.. జీవితంలో మీతో మాట్లాడునురా అంటూ శివాలెత్తుతున్నారు. మరోవైపు నామినేషన్‌లో ఉన్న ఏడుగురిలో ఒకరు ఎలిమినేట్ కానుండగా.. శుక్రవారం నాటితో ఓటింగ్ ముగియనుంది. ఇలాంటి ముచ్చట్లతో శుక్రవారం నాటి 27వ ఎపిసోడ్‌లోకి వెళ్తే.. ఐ డోంట్ నో అనే మార్నింగ్ వేకప్ సాంగ్‌కి స్టెప్పులు వేశారు బిగ్ భామలు. రోజూ మాదిరే బుల్లి బుల్లి చెడ్డీలతో బిగ్ బాస్ హౌస్‌లో డాన్స్‌లు చేస్తూ రచ్చ రేపారు దేత్తడి హారిక, మోనాల్, స్వాతి, అరియానాలు.
Samayam Telugu బిగ్ బాస్ 4 తెలుగు
Avinash And Harika


ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులకు డాన్స్ నేర్పారు కండల వీరుడు మెహబూబ్. లాస్యతో చపాతి స్టెప్పులు వేయించి నవ్వులు తెప్పించాడు. అలాగే కాలి గాయంతో ఉన్న అవినాష్‌తో స్టెప్పులు వేయించాడు. అఖిల్‌తో వర్కౌట్స్ స్టెప్‌లు, అభితో కార్ స్టెప్‌లు, సొహైల్‌తో అర్జున్ రెడ్డి ఆవేశం స్టెప్పులు, అరియానాతో రెడ్ లవ్ స్టెప్‌లు, రాజశేఖర్ మాస్టర్‌తో కాంచన స్టెప్పులు, కెప్టెన్ కుమార్‌తో కన్ఫ్యూజన్ స్టెప్పులు, గంగవ్వతో పడవ స్టెప్పులు వేయించి ఇరగదీశాడు మొహబూబ్. అనంతరం అవినాష్.. ప్రకాష్ రాజ్‌ వాయిస్‌ని మిమిక్రీ చేస్తూ వినోదాన్ని పంచాడు.

కన్ఫెషన్ రూంకి అఖిల్..
ఆటను రంజుగా మార్చడంలో భాగంగా.. అఖిల్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచారు బిగ్ బాస్. అఖిల్ రేషన్ మేనేజర్ అయ్యాడని చెప్పిన బిగ్ బాస్.. లగ్జరీ బడ్జెట్ షాపింగ్ మీరు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం 16 మంది సభ్యులకు 16 లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ నువ్వే రాయాల్సి ఉంటుందని పెద్ద పనే ఇచ్చారు. అయితే ఉన్న లగ్జరీ బడ్జెట్ పాయింట్స్‌ని 16 మందికి షేర్ చేయడం అఖిల్‌కి కష్టం కావడంతో.. కొంతమందికే లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ రాయగలిగాడు అఖిల్. దీంతో ఇంటి సభ్యులంతా గుసగుసలాడారు.

ఇక ఇంటి కెప్టెన్‌గా ఉన్న కుమార్ సాయి కునుకు తీయడంతో బిగ్ బాస్ కుక్కలు భౌ భౌ అంటూ అరవడంతో తెగ కామెడీ చేసి ఆట పట్టించాడు సొహైల్.

కొత్త బట్టలొచ్చాయ్.. ఫ్యాషన్ షోతో మెరుపులు
చందన బ్రదర్స్ వాళ్లు కొత్త బట్టలు పంపించడంతో అందంగా తయారై.. ప్యాషన్ షో చేసేశారు. ర్యాంప్ వాక్ చేసి విజేతలకు 1 లక్ష ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. అయితే పురుషుల్లో అవినాష్, మహిళల్లో గంగవ్వను ఫ్యాషన్ షో విన్నర్‌గా ప్రకటించారు. అయితే ఫ్యాషన్ షోని ఫ్యాషన్ లెక్క చూడకుండా.. మగాళ్లు గంగవ్వను విన్నర్‌గా ప్రకటిస్తే.. అమ్మాయిలు అవినాష్‌ని ఫ్యాషన్‌ షో విన్నర్‌గా లక్ష రూ. త్యాగం చేశారు.

ఇక ఇంట్లోని ఆడవాళ్లందరూ అవినాష్‌ని విన్నర్‌గా ప్రకటించినందున అవినాష్‌ అద్దంగా మారతాడని.. అమ్మాయిలు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అవినాష్‌ని అద్దంగా భావించి మనసులో మాటని చెప్పాలని వాటిని వినోదాత్మకంగా చెప్పాలని అవినాష్‌కి టాస్క్ ఇచ్చారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి అవినాష్ ముందు కూర్చొని మాట్లాడుతుండగా.. తన పంచ్‌లతో ఇరగదీశాడు అవినాష్. ఇక హారికతో ఓ ఆట ఆడుకున్నాడు అవినాష్.. ఆమె రాగానే ఈమె అద్దానికి అందడం లేదంటూ కింద కూర్చున్నాడు.. ఆ.. అంటూ ఏడుస్తూ హారిక ఉమ్మా.. ఉమ్మా అంటూ అద్దానికి ముద్దులు పెట్టగా.. ముద్దులన్నీ నాకు పెడుతున్నావ్.. నీ బాయ్ ఫ్రెండ్‌కి ఏం పెడతావ్ తరువాత అంటూ పంచ్ వేశాడు అవినాష్. అందుకే నేను అద్దం ముందు ఎక్కువ కూర్చోను అంటూ లేచి వెళ్లిపోయి జలక్ ఇచ్చింది హారిక. చివర్లో గంగవ్వ వెళ్లి అవినాష్‌ గాలి తీసేసింది. ఆ ముక్కు ఏంటి ఏంట్రా.. 60 ఏళ్లైనా నేను అందంగా ఉన్నాను.. నువ్ ఏంటి ఇలా ఉన్నావ్ అంటూ పంచ్‌లు వేసి నవ్వించింది గంగవ్వ.

అయితే అవినాష్ జోక్‌గా మాట్లాడిన మాటల్ని సీరియస్‌గా తీసుకుని తెగ బాధపడిపోయింది సుజాత. ఇంట్లో అందరూ జోక్‌లు వేసుకుంటూ జాలీగా ఉంటే తను మాత్రం ముఖం మాడ్చుకుని కూర్చింది. ఇక అవినాష్ వెళ్లి ఆమెకు సారీ చెప్పడంతో పాటు ఇలాంటి టాస్క్‌లు ఇవ్వొదని బిగ్ బాస్‌ని కోరాడు. దీనిపై అరియానా గ్లోరీ అవినాష్‌కి క్లాస్ పీకింది. వాళ్లకి నచ్చకపోతే వాళ్లతో ఉండకు.. వాళ్లపై జోక్‌లు వేయకు.. వాళ్ల కోసం నువ్ గేమ్ ఆడటం ఎందుకు మానేస్తావ్.. అంటూ హితభోద చేసింది.

మొత్తానికి శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సరదా సరదాగా గడిచిపోయింది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ హీట్ ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.