karthika deepam shourya: ‘కార్తీకదీపం’ చైల్డ్ ఆర్టిస్ట్ సౌర్య(బేబీ క్రితిక)కు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సీరియల్స్, సినిమాలతో ఎంతగానో అలరించిన ఈ చిన్నారి.. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అందిస్తూ.. ప్రేక్షకాదరణ పొందుతోంది. లేటెస్ట్గా యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ‘గ్యాంగ్ లీడర్’ సిరీస్‌లో మెయిన్ లీడ్ పోషించింది ఈ రౌడీ. దానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి తాజాగా రిలీజ్ అయ్యింది.
Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu11 Oct 2022, 6:57 pm
బుల్లితెర బాహుబలిగా ఓ ఊపు ఊపిన ‘కార్తీకదీపం’ సీరియల్.. దీప, కార్తీక్‌ల మరణంతో నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ అందులో ప్రధాన పాత్రలన్నీ పక్కన పెట్టారు. తీరా ప్రేక్షకాదరణ తగ్గిపోవడంతో.. ‘పోయినవారు బతికే ఉన్నారు’ అంటూ కొన్నేళ్ల క్రితం జరిగిన కథను ట్విస్ట్‌లతో మిక్స్ చేసి చెబుతున్నారు. ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీతో నడుస్తోంది కార్తీకదీపం.
Samayam Teluguకార్తీకదీపం సౌర్య
ప్రధానంగా ఇందులో వంటలక్క, డాక్టర్ బాబులతో పాటు వారి కవల పిల్లలు సౌర్య, హిమలు కూడా తిరిగి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో కార్తీకదీపం లొకేషనల్లో సందడి పెరిగింది. లైవ్ అప్ డేట్స్, లొకేషన్ అప్ డేట్స్ అంటూ.. ఇటు వంటలక్క(ప్రేమి విశ్వనాథ్).. అటు సౌర్య(బేబీ క్రితిక), హిమ, డాక్టర్ బాబు.. మోనిత.. ఇలా ప్రతి ఒక్కరూ తమతమ అభిమానులకు మళ్లీ దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే వంటలక్క తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన లైవ్‌లో సౌర్య కూడా కనువిందు చేసింది.
ఆ సమయంలోనే సౌర్య.. వంటలక్క అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. అదేంటంటే.. ‘నేను గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్ చేశాను నా యూట్యూజ్ ఛానల్లో.. ప్లీజ్ అందరూ దాన్ని చూడండి.. అలాగే త్వరలో రాబోయే దాని ఎపిసోడ్స్ కూడా పాలో అవ్వండి. అది చాలా బాగుంటుంది.. నాలో ఆల్ రెడీ రౌడీయిజాన్ని చూశారు కదా.. అదే ఒక గ్యాంగ్ లాగ పెద్ద రౌడీ అయ్యి ఉంటే ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ కూడా చూడబోతున్నారు.. అలాగే ఒక క్రేజీ మేనకోడలు, క్రేజీ మనవరాలు ఎలా ఉండబోతుందో అందులో ఉంది. అందరూ తప్పకుండా చూడండి.. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి.. తప్పకుండా వాటిని మీరు చూడాలి. ఇప్పటికి ఐదు ఎపిసోడ్స్ షూటింగ్ అయిపోయింది.. ఇంకా మూడు మిగిలియి.. త్వరలో అవి కూడా అయిపోతాయి. అన్నింటినీ త్వరలోనే రిలీజ్ చేస్తాం..’ అంటూ చెప్పుకొచ్చింది.
అంతా విన్న వంటలక్క(ప్రేమీ విశ్వనాథ్).. తన ఇన్స్టాగ్రామ్ అభిమానులతో.. ‘విన్నారు కదా.. నా చిట్టి కూతురికి సపోర్ట్ చేయండి. అందరూ తన గ్యాంగ్ లీడర్ ట్రైలర్‌ని తప్పకుండా చూడండి.. అందరూ చూసి ఎలా చేసిందో నాకు చెప్పండి.. బాగా చేసిందా లేదా? అని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. తను బాగా చేయలేదంటే కొడతా.. ఇక్కడ లొకేషన్లో కొడతా నేను తనని సరేనా?’ అంటూ నవ్వుతూ.. సౌర్యకు ఆశీర్వాదం అందిస్తుంది.
ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో బేబీ క్రితికకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లో రిలీజ్ అయ్యింది. యాక్టర్ అలీ దీన్ని రిలీజ్ చేశారని.. ట్రైలర్ చూసిన అలీ.. చాలా బాగుందని అభినందించారని చెప్పుకొచ్చింది బుల్లి రౌడీ బేబీ. మరీ వంటలక్క కోరిక మేరకు మీరు ఓ లుక్ వేయండి.
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.