యాప్నగరం

అద్భుతం: అచ్చం భూమి లాంటి ఏడు గ్రహాలు!

అచ్చం భూమి పరిమాణంలో ఉండే ఏడు గ్రహాలను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

TNN 23 Feb 2017, 8:54 am
అచ్చం భూమిని పోలిన ఏడు గ్రహాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. భూమి పరిమాణంలో ఉన్న ఈ ఏడు గ్రహాలు ట్రాపిస్ట్-1 నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో మూడు నివాసయోగ్యమైనవి గ్రహాలుగా నాసా వివరించింది. ఈ గ్రహాల ఉపరితలంపై నీటి నిల్వలు, శిలలు కూడా ఉన్నాయని, మరీ అంత వేడిగానీ, చల్లదనంగానీ లేదని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Samayam Telugu 7 new earth like exoplanets discovered nasa announces
అద్భుతం: అచ్చం భూమి లాంటి ఏడు గ్రహాలు!


సౌర కుటుంబంలో ఒకేసారి భూమిని పోలిన ఏడు గ్రహాలను గుర్తించడం అంతరిక్ష చరిత్రలో ఇదే మొదటిసారి. మిగతా గ్రహాలపై జీవరాశుల ఉనికి ఉందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దిశగా ఇదో గొప్ప ముందడుగని నాసాకు చెందిన ఖగోళ పరిశోధకుడు థామస్ జుర్బుచెన్ తెలియజేశారు. సౌర వ్యవస్థ వెలుపల జీవరాశి ఉనికి కనుక్కోవడానికి ఈ గ్రహాల ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని బెల్జియంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ గిల్లన్ తెలిపారు.

భూమి పరిమాణంలో ఉన్నఈ ఏడు గ్రహాలు ఒకే నక్షత్రం చుట్టూ పరిభ్రమించినట్లు గుర్తించడం ఇదే తొలిసారని ఖగోళ పరిశోధకులు పేర్కొంటున్నారు. ట్రాపిస్ట్-1 నక్షత్రానికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాలు ఒకదానికొకటి సమీపంగా ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా ఒకదాని నుంచి చూస్తే మరొకటి పెద్దదిగా కనపడినా ఒకే పరిమాణంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

అంటే భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడి మాదిరిగా కనబడతాయి. వీటి ఉపరితలంపై నుంచి వీక్షించినప్పుడు ఇతర గ్రహాలు అద్భుతంగా కనబడతాయని మైఖేల్ గిల్లన్ తెలియజేశారు. అలాగే ఆకాశంలోని కాంతి చుక్కలు మాదిరిగా అంటే భూమిపై నుంచి వీనస్‌ను చూస్తే ఎలా ఉంటుందో అలా కనబడతాయని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.