యాప్నగరం

కూర్చోబెట్టి ఆడించారు.. కసితీరా కొట్టేశాడు

టోర్నీ‌లో నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో నేను బెంచ్‌కే పరిమితమవడం

TNN 20 Apr 2017, 2:55 pm
‘న్యూజిలాండ్ తరఫున టెస్టులు, వన్డేల్లో అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ .. కానీ టీ20 ఫార్మాట్‌‌కి సరిపోయే వేగం అతనిలో లేదు’ గత కొంతకాలంగా కేన్ విలియమ్సన్‌పై తరచూ వినిపిస్తున్న మాట. ఈ విమర్శలో భాగంగానే ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లకి సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడ్ని బెంచ్‌కే పరిమితం చేసింది. కానీ.. బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌కి ఓ అవకాశం ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పయి ఒత్తిడిలో పడిన హైదరాబాద్‌ జట్టుని విలియమ్సన్ (89: 51 బంతుల్లో 6x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఒక ఎండ్‌లో శిఖర్ ధావన్ తడబడుతున్నా.. ఢిల్లీ బౌలర్లపై తన సహజ శైలికి భిన్నంగా ఎదురుదాడి చేసిన విలియమ్సన్ వరుసగా బౌండరీలు బాదేశాడు. చివరికి హైదరాబాద్ 191 పరుగుల భారీ స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మెన్లు తడబడటంతో ఢిల్లీ జట్టు 176/5కే పరిమితమైంది.
Samayam Telugu adapting well key to t20 success feels williamson
కూర్చోబెట్టి ఆడించారు.. కసితీరా కొట్టేశాడు


‘టోర్నీ‌లో నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో నేను బెంచ్‌కే పరిమితమవడం కూడా జట్టు వ్యూహంలో భాగమే. ఒక క్రికెటర్‌గా మ్యాచ్‌లు ఆడినా.. ఆడకపోయినా ప్రతి రోజు ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉంటాను. ఫార్మాట్‌కి తగినట్లుగా వేగంగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం పెద్ద సవాల్. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత పరిస్థితులను అర్థం చేసుకుని ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాను. మా తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో యువరాజ్ సింగ్, హెన్రిక్యూస్, ఓజా లాంటి హిట్టర్లు ఉండటంతో స్వేచ్ఛగా ఆడగలిగాను’ అని విలిమయ్సన్ వివరించాడు. విలియమ్సన్- ధావన్ జోడి రెండో వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతోనే హైదరాబాద్ 191 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.