యాప్నగరం

వెరీ గుడ్.. ‘అనంత’ కలెక్టర్‌పై సీఎం జగన్ ప్రశంసలు

అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడిపై సీఎం జగన్ ప్రశంసలు గుప్పించారు. పీఎం కిసాన్ అవార్డు అందుకున్నందుకు ఆయన్ను అభినందించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఇలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Samayam Telugu 25 Feb 2021, 7:54 pm

ప్రధానాంశాలు:

  • అనంత కలెక్టర్‌కు జగన్ అభినందనలు
  • పీఎం కిసాన్ జాతీయ అవార్డు అందుకున్న గంధం చంద్రుడు
  • దేశంలో మరే జిల్లాకు సాధ్యం కాని రీతిలో వెరిఫికేషన్ పూర్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu atp collector with jagan.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని సీఎం జగన్ ప్రశంసించారు. పీఎం కిసాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంత కలెక్టర్.. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అనంతపురం వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ఈ సందర్భంగా.. వెరీ గుడ్ అంటూ కలెక్టర్ గంధం చంద్రుడిని జగన్ అభినందించారు.
ప్రభుత్వ పథకాలన్నింటిని ఇలాగే మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనంతపురం కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. మరెన్నో రివార్డులు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

అవార్డ్ దేనికంటే..?

పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఏకంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డు జిల్లాకు దక్కింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ అవార్డును అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.