యాప్నగరం

అనంతపురం: మర్డర్‌కు స్కెచ్, ఇంతలో ట్విస్ట్.. ఎక్కడ దొరికిపోతామనే భయంతో రెండు హత్యలు!

కేశవ, మేనమామ గంగరాజుతో కలిసి ముదిగుబ్బకు వచ్చి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. యోగి వేమన జలాశయం దగ్గరకు రాగానే ఇద్దరిపై వేటకొడవళ్లతో దాడిచేశారు.

Samayam Telugu 18 May 2021, 12:59 pm

ప్రధానాంశాలు:

  • ఇద్దరు బైక్‌పై వెళుతుండగా కత్తులతో దాడి
  • ఒకరు అక్కడిక్కడే, మరొకరు ఆస్పత్రిలో మృతి
  • ఓ హత్యకు సహకరించనందుకే ఇలా!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలంరేపాయి. ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ దిగువపల్లికి చెందిన ఆదినారాయణకు కేశవ, చంద్ర కుమారులు. సోమవారం కేశవ, మేనమామ గంగరాజుతో కలిసి ముదిగుబ్బకు వచ్చి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. యోగి వేమన జలాశయం దగ్గరకు రాగానే ఇద్దరిపై వేటకొడవళ్లతో దాడిచేశారు. కేశవ అక్కడికక్కడే చనిపోగా.. గంగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.. కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలపై వేటకొడవలితో నరకడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ చనిపోయారు.
కేశవ పెదనాన్న కుమారులైన శివయ్య, శంకర, కాటమయ్య, శివ, రామచంద్రపై అనుమానం ఉందని బాధితులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తిని హత్యచేసేందుకు సహకరించలేదనే కక్షతోనే ఇద్దరిని హతమార్చినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు.కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేశవకు రెండేళ్ల కిందట గాయత్రితో వివాహమైంది.. వీరికి సంతానం లేదు. గంగరాజుకు ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనలో అల్లుడు, మేనమామ చనిపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.