యాప్నగరం

తాడిపత్రి: మహిళ ఫోన్‌కు ఆ ఫోటో.. వివాదంలో జేసీ అనుచరుడు

20 రోజుల క్రితం ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని పిలిచి విచారణ చేశారు. అప్పట్లో బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు.

Samayam Telugu 28 Aug 2021, 1:19 pm

ప్రధానాంశాలు:

  • తాడిపత్రి కౌన్సిలర్‌పై ఆరోపణలు
  • మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు
  • అందుబాటులో లేని కౌన్సిలర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 33 వ వార్డు కౌన్సిలర్, జేసీ ముఖ్య అనుచరుడు విజయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళకు ఆయన అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారనే ఆరోపణలు వచ్చాయి. 20 రోజుల క్రితం ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని పిలిచి విచారణ చేశారు. అప్పట్లో బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు. ఈ వేధింపులపై ఆ మహిళ ఐదు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలర్ విజయ్ కుమార్ పై 354d, 506సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. విజయ్ కుమార్ అప్పటి నుంచి రాష్ట్రంలో లేరని.. అందుబాటులోకి రాగానే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని డీఎస్పీ అన్నారు. ఈ వ్యవహారంపై విజయ్ కుమార్ స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.