యాప్నగరం

నాకు జీతం వద్దు, ఫ్రీగా పనిచేస్తా.. జగన్ సర్కార్‌కు గోవిందరెడ్డి లేఖ

మెట్టు గోవిందరెడ్డి జీతం లేకుండా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ నెల జీతం వద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యంకు లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Apr 2022, 1:41 pm

ప్రధానాంశాలు:

  • ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కీలక నిర్ణయం
  • తనకు జీతం వద్దని ఏపీఐఐసీ ఎండీకి లేఖ రాశారు
  • గతేడాది ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మెట్టు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గోవిందరెడ్డి
ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేస్తానని చెప్పారు. ఈ మేరకు ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నానని.. అందుకే జీతం తనకు వద్దన్నారు మెట్టు గోవిందరెడ్డి. ఆయన గతేడాది ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లాకు చెందిన మెట్టు గోవిందరెడ్డి 2003లో టీడీపీలో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో తిరిగి పోటీచేసినా ఓటమి ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేయడంతో గోవిందరెడ్డి తప్పుకున్నారు. దీంతో ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. మళ్లీ సీటు దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.. వైఎస్సార్‌సీపీలో చేరారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్‌ గోవిందరెడ్డికి నామినేటెడ్ పోస్టు ఇచ్చారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.