యాప్నగరం

ఐదుగురు ప్రాణాలు పోవడానికి ఉడత కారణమా?.. ఆటో ప్రమాద ఘటనలో కీలక విషయాలు!

Sri Satya Sai District Auto Accident ఘటనపై ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ స్పందించారు. ప్రమాదాని కారణాలను వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Jun 2022, 11:23 am

ప్రధానాంశాలు:

  • ఆటోపై విద్యుత్ వైర్లు పడటంతో ప్రమాదం
  • ఐదుగురు మహిళలు అక్కడిక్కడే మృతి
  • గాయపడినవారికి ఆస్పత్రిలో చికిత్స
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం నింపిన ఆటో ప్రమాదంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌‌ను ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు ఆదేశించారు. హై టెన్షన్ విద్యుత్ లైన్‌ పోల్ మీదకి ఒక ఉడత ఎక్కి వైర్‌‌ని షార్ట్ చెయ్యడం వల్ల అది తెగి అటుగా వెళ్తున్న ఆటోపై పడిందన్నారు. ఐదుగురు ప్రాణాలు పోవడానికి కారణం ఉడతని ప్రాథమికంగా నిర్థారించారు.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్నారు.
గురువారం ఉదయం తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగిపడింది.. వెంటనే ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్‌తో పాటు 8 మందికి గాయాలయ్యాయి. మృతిచెందిన ఐదుగురు మహిళలు 35 ఏళ్లలోపు గృహిణిలే. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఆటో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సీఎంకు ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.