యాప్నగరం

టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.. కార్యకర్తలకు మాత్రం శుభవార్త చెప్పిన అధినేత

తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలు లాయల్‌గా ఉంటారన్నారు అధినేత చంద్రబాబు. పార్టీని నిలబెట్టేది వాళ్లేనని.. వారు లేకపోతే నాయకులు లేరన్నారు. కార్యకర్తలకు ఓ శుభవార్త చెప్పిన అధినేత.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 May 2022, 4:03 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
  • పార్టీ నేతలు నా వెంట తిరిగితే లాభం లేదు
  • ఇకపై నా దగ్గరకు వచ్చి మెహమాట పెట్టొద్దు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చంద్రబాబు
క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదు.. పార్టీ కూడా అంతే అంటున్నారు చంద్రబాబు. పార్టీలో విచ్చలవిడిగా మాట్లాడితే కఠినంగా ఉంటానని.. కార్యకర్తలు పార్టీకి లాయల్‌గా ఉండాలని.. పార్టీని నిలబెట్టేది వాళ్లే అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు, కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొన్నారు. కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరు.. అలాగే కమిటీ వాళ్ల పని వాళ్లు చెయ్యాలన్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారని.. సమర్థత, పని తీరు చూసి ముందుగా ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు చంద్రబాబు.
పార్టీ నాయకులు తన చుట్టూ తిరిగితే లాభం లేదు.. కార్యకర్తల కోసం పని చెయ్యాలన్నారు బాబు. తన దగ్గరకు వచ్చి తనను మోహమాట పెడితే ఇకపై కుదరదన్నారు. 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తామని.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశం ఇస్తామన్నారు. తన వయసు 72 ఏళ్లు కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తానని.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందామని.. వైఎస్సార్‌‌సీపీ దొంగ ఓట్లపై కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు.

అసెంబ్లీలో తనపై వ్యక్తి గత దూషణలు చేస్తే.. శపథం చేసి బయటకు వచ్చానన్నారు టీడీపీ అధినేత. మళ్లీ సభను గౌరవ సభగా మార్చి సభకు వెళతానన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని.. హంద్రీనీవాపై జగన్ గాలి మాటలు చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేసే ప్రయత్నం చేశానని.. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు.. ఇన్స్యూరెన్స్ రావడం లేదన్నారు. హంద్రీనీవా కోసం పయ్యావుల, భైరవానితిప్ప కోసం మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వెంట పడేవారని గుర్తు చేశారు. పులివెందుల బస్ స్టాండ్ కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతారా అంటూ ఎద్దేవా చేశారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.