యాప్నగరం

టైమ్, ప్లేస్ ఫిక్స్ చేయండి.. నేను రెడీ: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్

సవాళ్లు.. ప్రతి సవాళ్లతో అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాలు వేడుక్కుతున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. ఆధారాలతో ఆయన మీడియా ముందుకు వచ్చారు.

Samayam Telugu 21 Jan 2022, 8:52 am
సవాళ్లు.. ప్రతి సవాళ్లతో అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాలు వేడుక్కుతున్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఓ పత్రికలో కూడా ఎమ్మెల్యేపై రాసిన కథనాలతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. ఆధారాలతో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
Samayam Telugu ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


గత కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎంఐజీ లేఅవుట్‌లపై ఓ పత్రిక రాసిన కథనాలు పూర్తిగా అవాస్తమన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో.. ఆ పత్రిక కథనాలు రాస్తోందని మండిపడ్డారు. జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్‌ కింద ఇస్తున్న ప్లాట్లు అభివృద్ధి చేయకుండానే ఇచ్చేస్తున్నారని ఆరోపణలు గుప్పించడం సరికాదన్నారు. లేఅవుట్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఎంఐజీ లేఅవుట్‌‌లో ఈ ఏడాదిలోపే అన్ని వసతులు కల్సిస్తున్నామని చెప్పారు.


రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. వరదాపురం సూరి తన ఉనికిని కోల్పోతున్నారని.. నిలకడలేని రాజకీయాలతో కార్యకర్తలను నాయకులను నట్టేట ముంచారని అన్నారు. సూరి తన ఉనికిని కాపాడుకునేందుకే తనపై అనవసర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

'అవినీతి ఆరోపణలు నిజమని మాజీ ఎమ్మెల్యే తన ఇష్ట దైవం చింతల వెంకటరమణ స్వామిపై ప్రమాణం చేస్తావా..?' అంటూ వరదాపురం సూరికి కేతిరెడ్డి సవాల్ విసిరారు. లేదంటే తన ఇష్ట దైవమైన శ్రీశైల మల్లన్న సాక్షిగా తాను ప్రమాణం చేస్తానని అన్నారు. ఈ సవాళ్లకు సిద్ధమైతే టైమ్, ప్లేస్ తెలియజేస్తే తాను ఎప్పుడైనా సిద్ధమన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేతిరెడ్డి స్పష్టం చేశారు. వరదాపురం సూరికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.