యాప్నగరం

పుట్టపర్తిలో హై టెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీఛార్జ్

Puttaparthi High Tension వాతావరణం కనిపించింది. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో సత్తెమ్మ ఆలయం దగ్గర చర్చకు, ప్రమాణం చేసేందుకు రావాలని ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరితో పాటూ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై మరొకరు రాళ్లు, చెప్పులు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Apr 2023, 11:55 am

ప్రధానాంశాలు:

  • పుట్టపర్తిలో హై టెన్షన్ వాతావరణం
  • ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి వార్
  • ఆలయం దగ్గరకు రావాలని సవాళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Puttaparthi High Tension
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (Puttaparthi Mla Sridhar Reddy).. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (Palle Raghunatha Reddy)ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. పల్లె రఘునాథ్‌రెడ్డి కూడా సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు పోటీ పోటీగా అక్కడికి చేరుకున్నారు. అయితే పుట్టపర్తిలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని పుట్టపర్తి టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దీంతో ముందుగానే పోలీసులు అప్రమత్తమై కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు. పల్లె రఘునాథ్ టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె రఘునాథరెడ్డి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. ఇటు ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డిలు ఉదయం సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది.. ఈ తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల్ని భారీగా మోహరించారు.. పుట్టపర్తిలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో పుట్టపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీధర్‌‌ను టార్గెట్ చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.. సత్తెమ్మ దేవాలయంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. శ్రీధర్‌రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధమని.. మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌ రెడ్డి కూడా సవాల్‌ను స్వీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు అలెర్ట్ అయ్యారు.

ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం జగన్ అండతో వైఎస్సార్‌సీపీ గ్యాంగ్ రెచ్చిపోతుందని.. టీడీపీపై దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వైఎస్సార్‌సీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.. ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని అరాచకాలకు నిలయంగా మార్చారని ఆరోపించారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.