యాప్నగరం

అనంతపురం: తాడిపత్రిలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

తాడిపత్రిలో 30 యాక్టు,144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు, ధర్నాలు నిరసన ప్రదర్శనలకు అనుమతి ఉండదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులను మెహరించారు.

Samayam Telugu 4 Jan 2021, 9:26 am
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్ కనిపిస్తోంది. సోమవారంఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరులు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మద్దతు తెలిపారు.
Samayam Telugu తాడిపత్రిలో టెన్షన్


దీక్షకు పిలుపునివ్వడంతో జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి పోలీసులు చేరుకున్నారు.. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటు అర్థరాత్రి బయటకు వెళ్లాలని ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే శాంతియుతంగా దీక్ష చేపడుతామని జేసీ సోదరులు చెబుతున్నారు. అవసరమైతే ఇంట్లోనే దీక్షకు దిగుతామని చెప్పారు.

ఇప్పటికే తాడిపత్రిలో 30 యాక్టు,144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు, ధర్నాలు నిరసన ప్రదర్శనలకు అనుమతి ఉండదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులను మెహరించారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయిస్తున్నారు. బయట వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా.. గుర్తింపు కార్డులుతో తనిఖీ నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.