యాప్నగరం

YSRCP నేత కుమార్తె ఆత్మహత్య.. MBBS పూర్తిచేసి పీజీ కోసం ప్రిపరేషన్.. ఇంతలో తీవ్ర విషాదం

Hindupur Ysrcp Councillor Daughter Suicide తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం సిద్ధమవుతోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Oct 2022, 8:55 am

ప్రధానాంశాలు:

  • హిందూపురంలో విషాద ఘటన
  • వైసీపీ కౌన్సిలర్ కుమార్తె ఆత్మహత్య
  • మెడికల్ పీజీ కోసం సిద్ధమవుతూ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hindupur Ysrcp Councilor Daughter Suicide
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఓ యువ వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. హిందూపురంలోని 1వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ మల్లికార్జున కుమార్తె సుప్రియ కర్నూలులోని మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఇప్పుడు బెంగళూరులో పీజీ కోర్సు పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో సిద్ధమవుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. సోమవారం ఉదయం ఇంటి మేడపైన ఉన్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత గమనించి ఆమె తండ్రి తండ్రి మల్లికార్జున.. ఆమెను కిందకు దించారు. కానీ అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదుతో హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధితకుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఫోన్‌ ద్వారా మల్లికార్జునను పరామర్శించారు.

సుప్రియ పీజీ కోర్సుకు సంబంధించి.. తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోనని.. ఆమె తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ ఒత్తిడితోనే ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.