యాప్నగరం

రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. కాకపోతే ఆ కోరిక నెరవేరగానే!

రాజకీయ భవిష్యత్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. కాకపోతే చిన్న కోరికను బయటపెట్టారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఏం చేస్తారో కూడా వివరించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పనిచేస్తానని.. కార్యకర్తలకు అండగా ఉంటానంటున్నారు. కేసులకు కూడా భయపడేది లేదంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లపై రౌడీషీట్లను పెట్టడం దారుణమన్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని గతంలోనే ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 19 Apr 2022, 1:07 pm

ప్రధానాంశాలు:

  • చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడికి జేసీ పరామర్శ
  • ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయడంపై విమర్శ
  • కేసులకు భయపడేది లేదన్న టీడీపీ నేత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటానని..ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి తనవంతుగా మరింత పని చేస్తానన్నారు. కళ్యాణ దుర్గంలో పసిపాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్‌ తెరవడం దారుణమని మండిపడ్డారు.
అనంతపురంలో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడి ఇంటికెళ్లి పరామర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్‌ కేసు నమోదు చేస్తే భయపడేది లేదన్నారు. జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉంటానని జేసీ ధైర్యం చెప్పారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని తన మనసులో మాటను చెప్పారు.

తాడిపత్రిలో మంత్రి ఉష శ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తమది శవరాజకీయం కాదని.. వైఎస్సార్‌సీపీ వాళ్లే శవ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. ఈ నెల 15న చనిపోయిన పాపం తండ్రికి పింఛన్ ఇప్పించాలని.. ఒకవేళ ఆ పనిచేస్తే తానే మంత్రి ఇంటికి వెళ్లి సన్మానిస్తానని చెప్పుకొచ్చారు. గతంలో మంత్రి ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలన్నారు జేసీ.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.