యాప్నగరం

Anantapur: ఆ వీడియోను మార్ఫింగ్ చేసి.. వైరల్ చేశారు: ఉషశ్రీ చరణ్

Anantapur: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. దాంట్లో ఆమె డబ్బుల పంపిణీ గురించి చర్చిస్తున్నట్టు ఉంది. దానిపై.. ఇటు టీడీపీ, అటు ఇతర పక్షాలు భగ్గుమన్నాయి. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. ఉషశ్రీ చరణ్ ఆ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. అది నిజం కాదని.. మార్ఫింగ్ చేశారని మంత్రి స్పష్టం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 Mar 2023, 4:04 pm

ప్రధానాంశాలు:

  • ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్
  • వైరల్ అయిన వీడియోపై స్ఫందించిన మంత్రి ఉషశ్రీ
  • ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sha Sree Charan
ఉషశ్రీ చరణ్
Anantapur: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్ఫందించారు.. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్. కళ్యాణదుర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి.. ఓటర్లను ప్రలోభపెట్టారన్న అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం లేదు.. దానిని మార్ఫింగ్ చేశారని స్పష్టం చేశారు. తన టేబుల్ మీద వేరే అంశం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీడియో తీశారని.. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని వివరించారు. ఒక బీసీ మహిళా మంత్రి అయిందని జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని Ushasri Charan ఫైర్ అయ్యారు.
తాను భూములు కొన్నా వివాదం చేస్తున్నారని.. మంత్రి ఉషశ్రీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తమకు భారీ విజయం ఖాయం అని స్పష్టం చేశారు. వైరల్ అయిన వీడియోలో.. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీపై ఆమె కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక గ్రామంలో ఇరవై మంది ఓట్లు ఉంటే.. ఇరవై వేలు ఇవ్వండని.. ఆ డబ్బు ఓటర్లకు చేరిందో లేదో.. ఫోన్ చేసి క్రాస్ చేసుకోవాలని Ushasri Charan నేతలకు సూచించడం వివాదాస్పదంగా మారింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.