యాప్నగరం

ఎన్టీఆర్ జయంతికి కోడలు ప్రత్యేక కార్యక్రమం.. హిందూపురంలో 2 రూపాయలకే భోజనం

శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో అన్న క్యాంటీన్‌ను బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ప్రారంభించారు. రూ.2కే పేదలకు ఈ క్యాంటీన్ ద్వారా భోజనం అందజేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 28 May 2022, 10:34 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జయంతిని సందర్శంగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చేందుకు కేవలం రెండు రూపాయలకే అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఈ క్యాంటీన్‌ను వసుంధర ప్రారంభించారు.
Samayam Telugu అన్న క్యాంటీన్ ప్రారంభించిన వసుంధారదేవి


హిందూపురం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వసుంధర దేవి హాజరై.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు వసుంధరకు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిరుపేదల ఆకలిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నిధులతో ఏర్పాటు చేసిన రెండు రూపాయలకే భోజన వసతి మొబైల్ క్యాంటీన్‌ను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం వసుంధరాదేవి మాట్లాడుతూ.. నిరుపేదల కష్టాలు తెలుసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం అందజేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఆయన తనయుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే భోజనం అందించడానికి మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ తన కళా నైపుణ్యంతో ప్రజల ఆదరాభిమానాలు పొంది రాజకీయ రంగంలో ప్రవేశించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజాసంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. పొట్టకూటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే భోజన వసతి కనిపిస్తున్నారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.