యాప్నగరం

రెండేళ్లు కలిసి తిరిగి, ఇప్పుడు పెళ్లికి నో.. హిజ్రాలతో కలిసి ప్రియుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు!

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ యువతి ప్రియుడికి ఊహించని రీతిలో షాకిచ్చింది.

Samayam Telugu 28 Apr 2021, 6:14 pm
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ యువతి వినూత్నరీతిలో కదంతొక్కింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇప్పుడు ముఖం చాటేసిన ప్రియుడికి దిమ్మతిరిగే రీతిలో షాకిచ్చింది. హిజ్రాలతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమించానంటూ వెంటపడ్డాడు.. ప్రేమించిన తర్వాత రెండేళ్లపాటు వెంట తిప్పుకున్నాడు.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఆ యువతి బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu బుక్కరాయసముద్రం


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓ యువతి (20), రాజా అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, పెళ్లి చేసుకోవాలని ఆమె అడుగుతుంటే.. రాజా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అన్ని విధాలుగా మోసపోయానని తెలుసుకున్న యువతి.. స్థానికులు, ఇంటి పక్కనే ఉన్న హిజ్రాలతో కలసి మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.

సదరు యువకుడిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోసం చేసిన యువకుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.