యాప్నగరం

కేంద్ర న్యాయ మంత్రితో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలే కీలకం!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు, హైకోర్టు తరలింపుపై వీరు చర్చించినట్లు తెలిసింది.

Samayam Telugu 15 Feb 2020, 4:29 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. దాదాపు 50 నిముషాల పాటు సీఎం జగన్, కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ys jagan


Also Read: అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కాగా, శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దాదాపు 40 నిముషాలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే. పోలవరం, రాజధానికి నిధులు, మూడు రాజధానులు, కర్నూలుకు హైకోర్టు ప్రధాన బెంచ్‌ తరలింపు, దిశ చట్టం ఆమోదం, పోలీసు వ్యవస్థ మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి పలు అంశాలపై కేంద్ర సాయాన్ని కోరిన విషయం తెలిసిందే. ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్‌ షాకు విన్నవించారు.
అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి 5 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం విదితమే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.