యాప్నగరం

CM Jagan birthday: ఆ జిల్లా వాసులకు స్పెషల్ గిఫ్ట్

West godavari జిల్లా తణుకులో రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి రేపు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా వాసులకు ప్రత్యేకంగా..

Samayam Telugu 20 Dec 2021, 8:32 pm
సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రేపు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి రేపు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 1,03,620 మంది లబ్ధిదారులకు జేఎస్‌బీహెచ్ఎస్ ద్వారా భూమి హక్కు పత్రాలను ముఖ్యమంత్రి అందజేయనున్నారు.
Samayam Telugu సీఎం జగన్ మోహన్ రెడ్డి


సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని మంగళవారం తణుకులో భారీ సభ నిర్వహించనున్నారు. జగనన్న సంపూర్ణ భూమి హక్కు పథకాన్ని (జేఎస్‌బీహెచ్ఎస్) సీఎం వైఎస్ జగన్ రేపు ప్రారంభించనున్నారు. జిల్లాకు సంబంధించిన 25 వేల మంది లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందచేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత మందికి లబ్ధి..?

జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డి గూడెం డివిజన్ పరిధిలోని 1137 గ్రామ/వార్డు సచివాలయాలలో 1,42,618 మంది లబ్ధిదారులకి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు 1126 సచివాలయాలకు చెందిన 1,03,620 మంది లబ్ధిదారులలో రుణాలు తీసుకున్న 13,948 మంది, రుణాలు లేని 89,672 మంది లబ్ధిదారులకి ఓటీఎస్ ద్వారా సంపూర్ణ భూమి హక్కు పత్రాలు అందజేస్తారు.

ఓటీఎస్ కింద 13,948 మంది లబ్ధిదారులకు పూర్తిగా మాఫీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థలం పొంది స్వంతంగా ఇల్లు కట్టుకున్నవారు, రుణాలు తీసుకుని ఇప్పుడు ఎటువంటి బకాయిలు లేని 89,672 మంది లబ్ధిదారులు ఒకొక్కరు పది రూపాయలు చొప్పున చెల్లింపు చేసి ఈ పథకం ద్వారా సంపూర్ణ భూమి హక్కు ప్రయోజనం చేకూరనుంది. జిల్లా యంత్రాంగం మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించే సమయంలో సీఎం జన్మదినాన్ని అందరి మనసుల్లో సుస్థిరంగా నిలిపే దిశలో అన్ని నియోజకవర్గాల్లో తహసీల్దార్ల ద్వారా 25 వేల మంది లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.