యాప్నగరం

TDP లో తీవ్ర విషాదం: మాగంటి రాం‌జీ కన్నుమూత.. చిన్న వయసులోనే!

Maganti Ramji: యువ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి కన్నుమూశారు. చిన్న వయసులోనే రాంజీ మరణంతో టీడీపీలో తీవ్ర విషాదం అలుముకుంది.

Samayam Telugu 8 Mar 2021, 9:25 am
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల క్రితమే రాంజీ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
Samayam Telugu మాగంటి రాంజీ కన్నుమూత


అయితే రాంజీ అనారోగ్యానికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇక ఆయన మరణానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, రాంజీ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. రాంజీ భౌతికకాయం సోమవారం ఉదయం ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి తరలించనున్నారు.

తెలుగు దేశం పార్టీలో యువనేతగా కొనసాగుతున్న మాగంటి రాంజీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు. కార్యకర్తలో ఎప్పుడూ టచ్‌లో ఉండే వారు. వారం రోజు క్రితం కూడా రాంజీ ట్వీట్టర్‌లో పోస్టులు చేశారు. అలాంటిది, కొద్ది రోజుల వ్యవధిలో రాంజీ కన్నుమూయడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత చిన్న వయసులో ఇంత ఘోరం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగంటి రాంజీకి ఆశ్మకు శాంతి చేకూరాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.