యాప్నగరం

లింగమార్పిడి చేయించుకున్న భర్త.. భార్య మరొకరితో.. విచ్చలవిడి జీవనం.. చివరికి..!!

భర్త వదిలేసిన ఆమె.. 23 ఏళ్ల కుర్రాడితో సహజీవనం చేస్తుంది.. వ్యసనాలకు బానిసైన ఇద్దరూ అర్ధరాత్రిళ్లు బైక్‌పై తిరుగుతూ విచ్చలవిడి తనానికి అలవాటు పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయింది.. ప్రేయసి మరణించిన కొద్ది క్షణాల్లోనే అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 5 Dec 2021, 8:10 pm
ఆమె ఒక వివాహితురాలు.. భర్తతో కొన్నేళ్లు కాపురం చేసింది.. భర్తతో ఇద్దరు పిల్లల్ని కూడా కనింది.. అయితే ఆ తర్వాత భర్త లింగమార్పిడి చేయించుకోవడంతో.. ఆమె, 23 సంవత్సరాల యువకుడితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. వ్యసనాలకు బానిసైన ఆ ఇద్దరూ అర్ధరాత్రిళ్లలో బైక్‌లపై చక్కర్లు కొడుతూ విచ్చలవిడిగా తయారయ్యారు. చివరికి ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఏలూరు బీడీ కాలనీకి చెందిన 22 సంవత్సరాల లక్కపాము సుధారాణి, రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించే సాయిప్రభుని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత సాయిప్రభు లింగమార్పిడి చేయించుకున్నాడు. దీంతో సుధారాణి, 23 సంవత్సరాల తాడి డింపుల్‌కుమార్ అనే వ్యక్తికి దగ్గరైంది. సుధారాణి తన ఇద్దరు కుమార్తెలను మాజీ భర్త దగ్గర ఉంచి.. డింపుల్ కుమార్‌తో కలిసి ఒక ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుంది. సుధారాణి, డింపుల్ కుమార్‌కి ఒక పాప కూడా పుట్టింది.

అయితే.. వ్యసనాలకు బానిసలైన సుధారాణి, డింపుల్ కుమార్ రాత్రి వేళ మద్యం తాగి బైక్‌పై చక్కర్లు కొట్టడం మొదలుపెట్టారు. ఎప్పటిలాగానే తాగి శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయకు వెళ్లిన ఇద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న క్రమంలో.. దారిలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారని పోలీసులు వెల్లడించారు.

ప్రమాదంలో సుధారాణి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించగా.. డింపుల్‌కుమార్‌కు గాయాలయ్యాయి. అయితే ప్రేయసి మరణించడంతో భయపడిన డింపుల్ బైక్‌ను అక్కడే వదిలేసి వెనుక నుంచి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున సుధారాణిని గుర్తించిన పోలీసులు.. సమాచారం కోసం ఇంటికి వెళ్లగా తలుపులు వేసి ఉండటంతో తాళం పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కి డింపుల్ మృతదేహం వేలాడుతుండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే.. స్థానికులు వీరిపై మరో వాదనను వినిపిస్తున్నారు. సుధారాణి, డింపుల్ గంజాయి, మత్తు పదార్థాలకు బానిసయ్యారని.. అర్ధరాత్రి వేళ వీరిద్దరికి గొడవ జరిగి.. డింపుల్ కోపం సుధారాణిని హత్య చేసి.. ఆ తర్వాత భయపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.