యాప్నగరం

TDP MLA పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. యాత్రకు ముందు ట్విస్ట్!

Nimmala Ramanaidu పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం శాంతి యాత్రకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Aug 2022, 11:04 am

ప్రధానాంశాలు:

  • టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
  • వైసీపీ నేత ఫిర్యాదు చేయడంతో
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nimmala Ramanaidu
పశ్చిమ గోదావరి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారని నిమ్మలపై వైఎస్సార్‌సీపీ నేత ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంపై ఎమ్మెల్యే రామానాయుడు స్పందించాల్సి ఉంది. అయితే ఇది తప్పుడు కేసు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. కుట్రపూరితంగా కేసు పెట్టారని చెబుతున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే శాంతి యాత్ర చేయడానికి వీలులేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. శాంతి, భద్రతల పేరుతో తమను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గంలో పర్యటిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటించే హక్కు ఉంటుందని.. కానీ పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.

టిడ్కో ఇళ్లు పంపిణీ కార్యక్రమంలో తనపై దాడి జరిగితే పోలీసులు కనీసం అడ్డుకోలేదన్నారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగకూడదని, మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో చెప్పారని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ ప్రజల్లో ఉంటామని.. ప్రజల కష్టాలను తెలుసుకుంటామన్నారు. ఇంటింటికి తిరగకూడదని తనకు రాసివ్వండి అంటూ పోలీసుల్ని కోరారు. ప్రజల ఇళ్లకు వెళితే తనకు సమస్యల్ని చెప్పుకుంటున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే పాలకొల్లులో అరాచక సంస్కృతి వద్దు అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.