యాప్నగరం

ప.గో: గుడికి వెళ్దామన్న భార్య, నో చెప్పిన భర్త.. ఆమె షాకింగ్ నిర్ణయం

దొడ్డా సురేష్‌, భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గత నెల 28న వారి కుమార్తె పుట్టినరోజు.. భార్య సత్య దేవాలయానికి తీసుకువెళ్లమని భర్తను కోరింది.. కానీ సురేష్‌ నిరాకరించాడు.

Samayam Telugu 3 May 2021, 7:36 am

ప్రధానాంశాలు:

  • కూతురి పుట్టిన రోజని గుడికి తీసుకెళ్లమన్న భార్య
  • గుడికి తీసుకెళ్లడం కుదరదని భార్యకు చెప్పిన భర్త
  • మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న భార్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుమార్తె పుట్టిన రోజున భర్త గుడికి తీసుకెళ్లలేదని భార్య ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. భీమవరం బలుసుమూడి ఎస్టీ కాలనీలో దొడ్డా సురేష్‌, భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గత నెల 28న వారి కుమార్తె పుట్టినరోజు.. భార్య సత్య దేవాలయానికి తీసుకువెళ్లమని భర్తను కోరింది.. కానీ సురేష్‌ నిరాకరించాడు. దీంతో భార్య మనస్తాపానికి గురైంది.. వెంటనే వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
భార్యను గమనించిన భర్త వెంటనే కిందకు దింపి.. ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె ఆదివారం కన్నుమూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చిన్న కారణానికే ఆమె ప్రాణాలు తీసుకుంది.. ఇద్దరు పిల్లల బాగోగులు చూసేవారే లేరంటూ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.