యాప్నగరం

పల్నాడు: బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయం.. ఖాతాదారుల్లో ఆందోళన

Dachepalli Banks Customers ఆరోపణలు చేస్తున్నారు. తమ బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని చెబుతున్నారు. చాలామంది ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు ఫిర్యాద చేశారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయమని బ్యాంకు అధికారులు కస్టమర్లకు సలహా ఇస్తున్నారు. బ్యాంకులో ఎలాంటి సమస్య లేదని.. ఆధార్‌తో బయట లావాదేవీలు చేయడం వల్ల కొందరి అకౌంట్‌ల నుంచి డబ్బులు మాయం అయ్యాయని వారు చెబుతున్నారు. దీంతో వారిలో టెన్షన్ మొదలైంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 Feb 2023, 4:50 am

ప్రధానాంశాలు:

  • పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘటన
  • అకౌంట్‌లలో డబ్బులు మాయం
  • ఆందోళనలో బ్యాంక్ ఖాతాదారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Dachepalli Cash Debit From Accounts
పల్నాడు జిల్లా దాచేపల్లిలో బ్యాంకు ఖాతాల్లోని తమ డబ్బులు మాయం అయ్యాయంటూ కొంతమంది ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తమ అకౌంట్లలోని డబ్బులు తమకు తెలియకుండానే డ్రా చేశారంటూ వాపోతున్నారు. ఇళ్లల్లో రక్షణ ఉండదని బ్యాంకుల్లో దాస్తే... అక్కడ కూడా భద్రత లేకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా దాచేపల్లిలోని యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐకి చెందిన కొంతమంది కస్టమర్లు డబ్బులు పోయాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై బ్యాంక్ అధికారులను అడిగితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్తున్నారని వాపోతున్నారు.

అయితే బ్యాంక్ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. బ్యాంకు లోపల జరిగిన లావాదేవీల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్ సాయంతో బయట వ్యక్తుల వద్ద లావాదేవీలు జరిపిన కొంతమంది ఖాతాదారులు మాత్రమే నగదు కట్ అయ్యిందని తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బయోమెట్రిక్ ద్వారా అనధికారికంగా నగదు లావాదేవీలు చేసే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.