యాప్నగరం

వాలంటీర్ శారద హత్య కేసు నిందితుడు ఆత్మహత్య.. వివాహేతర సంబంధం విషాదాంతం

వివాహేతర సంబంధం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాలంటీర్ శారదను హత్య చేసిన పద్మారావు గురువారం తెల్లవారుజామున రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 19 May 2022, 11:56 am
గుంటూరు: బాపట్ల జిల్లా చావలి గ్రామానికి చెందిన వాలంటీర్ శారద హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెను హత్య చేసిన పద్మారావు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు సమీపంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతి నుంచి వైజాగ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జేబులో ఉన్న ఐడీ కార్డుల ఆధారంగా మృతుడిని గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సైతం చనిపోయిందని పద్మారావేనని నిర్ధారించారు.
Samayam Telugu Representative Image


వివాహేతర సంబంధంతో..
చావలి గ్రామ వాలంటీర్‌గా పని చేస్తోన్న శారదకు 2008లో అదే ఊరికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుండగా.. నాలుగేళ్ల క్రితం పద్మారావుతో శారదకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో.. పద్మారావును శారద దూరం పెట్టింది.

ఆరు నెలల క్రితం పద్మారావు గ్రామ సచివాలయం వద్ద శారదపై చేయి చేసుకోగా.. వ్యవహారం వేమూరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసులు అతణ్ని మందలించి వదిలిపెట్టారు. అప్పటి నుంచి శారదపై ఆగ్రహంతో ఉన్న పద్మారావు.. గత ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు చీపురుతో ఊడుస్తోన్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకొని పారిపోతున్న ఆమెను వెంబడించి మళ్లీ దాడి చేసి పరారయ్యాడు. దీంతో శారద అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అప్పటి నుంచి పరారీలో ఉన్న పద్మారావు.. గురువారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. శారద హత్య కేసులో పోలీసులు తన కోసం వెతుకుతుండటంతోనే.. అతడు సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.