యాప్నగరం

గుంటూరు: గోమాతకు సీమంతం.. వైభవంగా వేడుక, ఎంత బాగా చేశారో చూశారా!

ఉండవల్లిలో ఆవుకు సీమంతం చేశారు. జొన్న సాంబశివరావు (బుడ్డి) అనే రైల్వే ఉద్యోగి నివాసంలో గోమాతకు భక్తిశ్రద్ధలతో సీమంతం వేడుక నిర్వహించి మహిళలకు సారె పంచిపెట్టారు.

Samayam Telugu 26 Nov 2021, 9:28 am

ప్రధానాంశాలు:

  • ఉండవల్లిలో ఆవుకు సీమంతం
  • వైభవంగా వేడుక నిర్వహించారు
  • మహిళలు ప్రత్యేక పూజలు చేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గుంటూరు జిల్లా
హిందూ సంప్రదాయంలో ఆవును దైవంగా భావిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆవును పూజిస్తే సకల సుఖాలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సంతాన సమస్యలు తొలుగుతాయని హిందువులు నమ్ముతారు. భక్తి విశ్వాసంలో భాగంగా దైవంగా భావించే గోవులకు సీమంతం వేడుకలు కూడా శాస్త్రోక్తంగా పలువురు నిర్వహిస్తున్నారు. ఇంటి ఆడబిడ్డలకు నిర్వహించినట్లే గోవుకు కూడా సీమంతం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఆవుకు సీమంతం చేశారు. జొన్న సాంబశివరావు (బుడ్డి) అనే రైల్వే ఉద్యోగి నివాసంలో గోమాతకు భక్తిశ్రద్ధలతో సీమంతం వేడుక నిర్వహించి మహిళలకు సారె పంచిపెట్టారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన గోమాత సీమంతం వేడుకలో పాల్గొనేందుకు ఆడపడుచులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఆవులలో సకల దేవతలు ఉంటారని హిందూ పురణాలు చెబుతున్నారు. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, స్థనాల్లో చతుర్వేదాలు, ఇలా ఒక్కో భాగం ఒక్కో దేవత నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే గోమాతకు పూజలు చేసి ప్రదక్షిణాలు చేయడం హిందూ భక్తి సంప్రదాయంలో ఓ భాగంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.