యాప్నగరం

తల్లిదండ్రులకు తలుపు తెరిచిన కూతురు.. ఆ తర్వాత అందరూ కలిసి..

Samayam Telugu 14 Dec 2021, 9:07 am
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరంటారూ.. నిజమే పట్టుకోవడం చాలా కష్టం.. కానీ కొంచెం టైం పట్టినా కచ్చితంగా వాళ్లే పట్టుబడతారు. ఓ రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయి ఇంట్లో రెండు నెలల కిందట దొంగతనం జరిగింది. ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టమైంది. చివరికి సొంత కూతురు, అల్లుడు, మనవరాలే ఈ దొంగతనం చేశారని తెలుసుకుని షాకయ్యాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మల్లముపాటి వీరభద్రరావు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కుమార్తె అనురాధను 15 ఏళ్ల కిందట ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన రామావత్ బ్రహ్మయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. భార్య చనిపోవడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉండటంతో.. 14 సంవత్సరాల మనవరాలిని దత్తత తీసుకున్నాడు.

అయితే.. వీరభద్రరావు ఇంట్లో రెండు నెలల కిందట చోరీ జరిగి రూ.4.7 లక్షల విలువైన సొమ్మును అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. వీరభద్రరావు కూతురు అనురాధ, అల్లుడు బ్రహ్మయ్య చోరీకి పాల్పడ్డారని.. వీరి పాపే వీరికి సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.4 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారితో పాటు 14 సంవత్సరాల వీరభద్రరావు మనవరాలిని కూడా అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.