యాప్నగరం

మహిళా వాలంటీర్‌తో ఎమ్మార్వో నీచం.. అర్ధరాత్రి 22 సార్లు ఫోన్ చేసి.!

ఇంటి పట్టాల కోసం భారీగా డబ్బులు తీసుకుని అనర్హులను ఎంపిక చేసినట్లు తహసీల్దార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం ఫిర్యాదు చేసిందన్న నెపంతో మహిళా వాలంటీర్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు పడింది.

Samayam Telugu 4 Jul 2021, 10:39 pm
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ఎమ్మార్వో ప్రభాకర్‌ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సస్పెండ్ చేశారు. జగనన్న ఇంటి పట్టాల మంజూరులో భారీ అవకతవకలకు పాల్పడినట్టు తహసీల్దార్‌పై ఆరోపణలు వచ్చాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన అనర్హులకు డబ్బులు తీసుకుని ఇంటి పట్టాలు మంజూరు చేశారు. డబ్బులివ్వలేదనే అక్కసుతో అర్హులకు ఇంటి పట్టాలు రాకుండా అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
volunteer


తహసీల్దార్ వ్యవహారంపై గుర్రుగా ఉన్న అధికార వైసీపీ నేతలు ఏకంగా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో విషయం సీరియస్‌గా మారింది. లంచగొండి ఎమ్మార్వో మాకొద్దు అంటూ స్థానికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ సమయంలోనూ అవినీతికి పాల్పడినట్లు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఓ మహిళా వాలంటీర్ ఫిర్యాదుతో తహసీల్దార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం.

సదరు వాలంటీర్ ఎమ్మార్వో అక్రమాలను పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిందని తహసీల్దార్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ప్రభాకర్, అతని సోదరుడు, లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, రత్నా రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్‌కి ఫోన్ చేసి అసభ్యకరంగా దూషించారన్న ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి వేళ 22 సార్లు ఫోన్ కాల్స్ చేసి తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఎమ్మార్వో వ్యవహారశైలిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.