యాప్నగరం

తెనాలి: ‘వకీల్ సాబ్’ సినిమా చూస్తూ, థియేటర్‌లోనే ప్రేక్షకుడు సడన్‌గా..!

గుంటూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వకీల్ సాబ్ సినిమా చూస్తున్న ఓ వ్యక్తి హటాత్తుగా..!

Samayam Telugu 13 Apr 2021, 4:13 pm
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలోని లక్ష్మీ డీలక్స్ హాల్‌లో ‘వకీల్ సాబ్’ సినిమా చూస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Samayam Telugu వకీల్ సాబ్ మూవీ స్టిల్


తెనాలి లక్ష్మీ డీలక్స్‌లో మంగళవారం మార్నింగ్ షో జరుగుతుండగా, ఓ యువకుడు ఓ యువకుడు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. సినిమా చూస్తున్న వారు వెంటనే, థియేటర్ సిబ్బందికి తెలపగా.. యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.