యాప్నగరం

గుంటూరు: 4 రోజుల పసికందు మాయం.. సీసీ ఫుటేజ్ చూస్తే, షాకింగ్

బాబును పక్కన పెట్టి అమ్మమ్మ నిద్రపోవటంతో.. ఇదే అదనుగా భావించిన ఇద్దరు.. బాబును ఎత్తుకెళ్లారు. నడి వయస్కుడైన ఓ వ్యక్తి చిన్నారిని ఓ సంచిలో వేసుకొని తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Samayam Telugu 16 Oct 2021, 11:11 am

ప్రధానాంశాలు:

  • గుంటూరు GGHలో కిడ్నాప్ కలకలం
  • నాలుగు రోజుల పసికందు మిస్సింగ్
  • సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గుంటూరు జీజీహెచ్
గుంటూరు జీజీహెచ్లో కిడ్నాప్ కలకలం రేగింది. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో.. 4 రోజుల వయసున్న ఓ శిశువు కిడ్నాప్‌కు గురయ్యాడు. గుంటూరు జిల్లా పెద కాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 13వ తేదీన బాబుకు జన్మనిచ్చింది. బాలింతను, శిశును చూసుకోవడం కోసం... అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో పసికందు ఏడుస్తుండటంతో.. నాన్నమ్మ బాబును బయటకు తీసుకొచ్చింది. తర్వాత బాత్రూమ్‌కు వెళ్తూ.. అమ్మమ్మ పక్కన ఉంచి వెళ్లింది.
ఆమె బాత్రూమ్‌కు వెళ్లి తిరిగొచ్చే సరికి.. కేవలం ఐదు నిమిషాల్లోనే పసికందును అపహరించారు. దీంతో ఆందోళన చెందిన బాధితులు.. కొత్త పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్ గేటు ముందున్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. నడి వయస్కుడైన ఓ వ్యక్తి చిన్నారిని ఓ సంచిలో వేసుకొని తీసుకెళ్లడం కనిపించింది. అతడి కంటే ముందు ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లింది. సెక్యూరిటీ సిబ్బంది ముందు నుంచే వారు వెళ్లినప్పటికీ.. బాబు సంచిలో ఉండటంతో.. అతడికి అనుమానం రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.