యాప్నగరం

TDP ఎమ్మెల్యేను కిందకు తోసేసిన వైసీపీ కార్యకర్తలు.. హై టెన్షన్

Palakollu Tidco Houses పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. తాను మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Aug 2022, 2:48 pm

ప్రధానాంశాలు:

  • పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం
  • హాజరైన మంత్రులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ
  • తనకు మైక్ ఇవ్వకపోవడంపై నిమ్మల ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nimmala Rama Naidu
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ (Palakollu Tidco Houses) సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభ ప్రారంభంకాగానే మంత్రులు ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, దాడిశెట్టి రాజాలు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu), ఎమ్మెల్సీ అంగరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తన నియోజకవర్గ సభలో తనను మాట్లాడనివ్వరా అంటూ ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని, మైక్ ఇవ్వాలంటూ సబ్ కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను పట్టించుకోకుండా మంత్రులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తనకు మైక్ ఇచ్చి మాట్లాడించే వరకు కదిలేది లేదన్నారు ఎమ్మెల్యే. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.
ఎమ్మెల్యే రామానాయుడు గురువారం 1860 టిడ్కో గృహాలను పరిశీలించారు. తన పోరాటం ఫలించింది అని.. టీడీపీ హయాంలో 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లకు ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదని విమర్శించారు. గతంలో పూర్తైన ఇళ్లకు వైఎస్సార్‌సీపీ రంగులు వేసుకుని తాము నిర్మించినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు అసెంబ్లీ అధికారులు 2019 నాటికి 3360 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

టీడీసీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులతో కలసి తాను చేసిన పోరాటాలకు మూడేళ్లకైనా ప్రభుత్వం దిగి వచ్చి లబ్ధిదారులకు1860 ఇండ్లు పంపిణీ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి లబ్ధి దారులకు వెంటనే పంపిణీ చేయాలని .. వైఎస్సార్‌సీపీ నేతలు టిడ్కో ఇండ్ల నిర్మాణంలో అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయాలని కొద్దిరోజులుగా నిమ్మల రామానాయుడు నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో కొద్దిరోజులుగా వినూత్నంగా నిరసనలు చేశారు. నిమ్మల రామానాయుడు పొద్దున్నే ఇంటింటికి తిరిగి పేపర్ వేశారు. తన పోరాటం నిరసనలతో ప్రభుత్వం ఇప్పుడు ఇళ్లు పంపిణీ చేస్తోందన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.