యాప్నగరం

నా భవిష్యత్ అడుగులు వ్యూహత్మకంగా ఉంటాయి.. ప్రధాని మోదీకి చెప్పి చేయను: పవన్

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీపై (YSRCP) మరోసారి ఫైరయ్యారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటంచిన ఆయన.. వైసీపీ ప్యూడలిస్టిక్ గోడలు బద్ధలు కొడతామన్నారు. తన భవిష్యత్తు అడుగులు వ్యూహత్మంగా ఉంటాయని.., 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటంలో అధికార పార్టీ గడపలు కూల్చిందని.., వైకాపా గడప కూల్చేవరకు నిద్రపోనని అన్నారు. 2024 ఎన్నికలు కీలకమన్న పవన్.. వైసీపీ 175 సీట్లు ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Nov 2022, 2:02 pm

ప్రధానాంశాలు:

  • జగన్ సర్కారుపై జనసేన అధినేత పవన్ ఫైర్
  • వైసీపీ గడప కూల్చేవరకు నిద్రపోనని వ్యాఖ్య
  • ఆ పార్టీ ప్యూడలిస్టిక్ గోడలు బద్ధలు కొడతామని మండిపాటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pawan kalyan
పవన్ కల్యాణ్
Pawan kalyan: వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని అన్నారు. తాను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన ఆయన.. కూల్చివేతల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
"2024లో చాలా కీలకమైన ఎన్నికలు. వైసీపీకి 175కి 175 సీట్లు రావాలంటా.. మేము చూస్తూ ఊరుకుంటామా?. సజ్జలకు ఛాలెంజ్ విసురుతున్నా.. మీరు ఎలా గెలుస్తారో నేనూ చూస్తా. సజ్జల, వైసీపీలది ఆధిపత్యపు అహంకారం. సజ్జల ఢిప్యాక్టో సీఎం. వైసీపీ నేతలకు సంస్కారం, మంచి మర్యాద పని చేయవు. వైసీపీ పార్టీనా ? టెర్రరిస్టు సంస్థనా? వీధి రౌడీలతో ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. మాకు ఓట్లు వేసినా.. వేయకున్నా.. మీ కష్టాల్లో అండగా ఉంటా. ఇప్పటం గ్రామస్థుల్లా.. అమరావతి రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదు." అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ప్రతి పథకానికి జగన్ పేరు అవసరమా ? అని పవన్ ప్రశ్నించారు. పథకాలకు జగనన్న విద్యా దీవెన అని పేరు ఎందుకు పెడతారు ?, గుర్రం జాషువా అని ఎందుకు పెట్టరని నిలదీశారు. పింగళి వెంకయ్య అని క్యాంటీన్‌ నామకరణం చేయలేరా ? అని ప్రశ్నించారు. " ప్రతి పథకానికి జగన్ పేరు అవసరమా ? వైసీపీ వాళ్లు ఆఖరుకు వైఎస్సాఆర్ దేశం అని పెడతారేమో. రాజకీయం మీరే చేయాలా.. మేం చేయకూడదా. కోడికత్తిలా మేం డ్రామాలాడలేం. వైసీపీ ప్యూడలిస్టిక్ గోడలు బద్ధలు కొడతాం. నా భవిష్యత్తు అడుగులు వ్యూహత్మకంగా ఉంటాయి. ఇప్పటంలో ఇళ్లను కూల్చి.. నా గుండెల్లో గునపం దింపారు. ఇప్పటంలో గడపలు కూల్చారు.. వైకాపా గడప కూల్చేవరకు నిద్రపోను. " అని పవన్ అన్నారు.

ప్రధానితో ఏం మాట్లాడామే ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఎందుకని జనసేనాని పవన్ ప్రశ్నించారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పకుండా తానే చేస్తానని అన్నారు. బీజేపీ వాళ్లను అడగకుండా తానే యుద్ధం చేస్తానని వ్యాఖ్యనించారు. ఆంధ్రాలో పుట్టిన వాడినని.., తాను ఇక్కడే తేల్చుకుంటానని వ్యాఖ్యనించారు. ఎమ్మెల్యేలు, సీఎంల కొడుకులు రాజకీయాల్లో ఉండటం కాదని... సామాన్యూలు రాజకీయాల్లో ఉండాలని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పవన్ వ్యాఖ్యనించారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.