యాప్నగరం

వైసీపీ నిర్వహించిన ముగ్గుల పోటీలో ఊహించని పరిణామం.. వీడియో, ఫోటో వైరల్

Sattenapalli Janasena Party Rangoli వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో జనసేన పార్టీ ముగ్గు వేయడం ఆసక్తికరంగా మారింది. ఓ మహిళ జనసేన పార్టీకి అనుకూలంగా ఓ ముగ్గు వేశారు. అందులో జనసేన లోగోతో.. వైసీపీ వద్దు - జనసేన ముద్దు అని కూడా రాశారు. ఇప్పుడు ఈ ముగ్గుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో జనసైనికులు బాగా వైరల్ చేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Jan 2023, 1:58 pm

ప్రధానాంశాలు:

  • సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ
  • ఓ మహిళ అక్కడ జనసేన పార్టీ ముగ్గు వేశారు
  • ఆమె రాసిన స్లోగన్ ఇప్పుడు వైరల్ అయ్యింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Janasena Rangoli In Ysrcp Competition
ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సొంత నియోజకవర్గం సత్తెనపల్లి పరిధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో స్థానికంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో తోట సాయిలక్ష్మి అనే మహిళ పాల్గొన్నారు. జనసేన పార్టీ (Janasena Party) లోగో, గుర్తుతో ముగ్గు వేశారు. అక్కడితో ఆగకుండా ఆ ముగ్గుపై ‘వైసీపీ వద్దు-జనసేన ముద్దు’ అని రాశారు.
వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పోటీల్లో జనసేన పార్టీకి అనుకూలంగా ఈ ముగ్గు దర్శనమివ్వటం చర్చనీయాంశంం అయ్యింది. కొందరు ఈ ముగ్గును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేశారు కొందరు జనసైనికులు. అయితే మంత్రి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారనే టాక్ కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోతో పాటూ వీడియో వైరల్ అవుతోంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.