యాప్నగరం

వదిన కొడుకులపై సైకో మరిది ఘాతుకం.. గుంటూరులో ఘోరం

సొంత బాబాయి సైకోగా మారాడు. ఆడుకుంటున్న వదిన కొడుకులను దారుణంగా హతమార్చాడు. చిన్నారులపై కనీస కనికరం లేకుండా విచక్షణా రహితంగా కొట్టి చంపేయడం తీవ్ర కలకలం రేపింది.

Samayam Telugu 28 Jun 2021, 7:42 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వదిన కొడుకులను అతి కిరాతకంగా కర్రలతో కొట్టి చంపేశాడో సైకో. అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు రేపల్లెకి చెందిన ఉమాదేవితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు పార్థివ్ సాహసవత్(10), రోహిత్ తశ్విన్(8) ఉన్నారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కోటేశ్వరరావు, ఉమాదేవి లాక్‌డౌన్ కారణంగా సొంతూరు వచ్చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


తమ ఇద్దరు పిల్లలతో సహా ఉమాదేవి పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన ఉమాదేవి చెల్లెలి భర్త కాటూరి శ్రీనివాసరావు దారుణానికి ఒడిగట్టాడు. అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసి దారుణంగా కొట్టి చంపేశాడు. చెక్క మొద్దులతో విచక్షణ రహితంగా దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సైకో అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే నిందితుడు కాటూరి శ్రీనివాసరావుకి చాలా కాలంగా మతిస్థిమితం లేదని.. మందులు వాడుతున్నట్లు అత్త విజయలక్ష్మి చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. చిన్నారుల మృతదేహాలను రేపల్లె ఆస్పత్రికి తరలించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.