యాప్నగరం

గుంటూరు: కూతుర్ని యువకుడు ప్రేమించాడని.. తండ్రి కిరాతకం, మరీ దారుణంగా

వెంకటేష్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.

Samayam Telugu 28 Apr 2021, 12:40 pm

ప్రధానాంశాలు:

  • గుంటూరు జిల్లా కొప్పురావూరులో దారుణం
  • కూతుర్ని ప్రేమించినందుకు యువకుడిపై కక్ష
  • కిరాతకంగా యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పెద కాకాని
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమించడానే కోపంతో ఓ యువకుడి కాళ్లు, చేతులు నరికాడో తండ్రి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి అతడు చనిపోయాడు. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేష్‌ను పిలిపించి పంచాయితీ పెట్టారు. పెద్దలు చెప్పడంతో వెంకటేష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.
వెంకటేష్ మాత్రం అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారం యువకుడిని గత రాత్రి నమ్మకంగా గ్రామానికి పిలిపించారు. మాట్లాడాలంటూ శివారులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఆమె తండ్రి మరో ఐదుగురు కలిసి యువకుడ్ని మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దాడికి పాల్పడ్డ ఆరుగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.