యాప్నగరం

ఉసురు తీసిన అప్పులు... ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల అఘాయిత్యం

ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన రామకృష్ణ భార్య అనూష సహా ఇద్దరు పిల్లలతో కలిసి బి.కోడేరు మండలంలోని సగిలేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 5 Jun 2021, 9:14 am

ప్రధానాంశాలు:

  • కడప జిల్లాలో విషాద ఘటన
  • ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
అప్పుల బాధ భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా బి.కోడూరు మండలంలో చోటుచేసుకుంది. సగిలేరు జలాశయంలో శుక్రవారం ఉదయం దంపతులు, ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించడంతో సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, బి.కోడూరు ఎస్‌.ఐ.వరలక్ష్మీదేవి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాలను వెలికి తీశారు.
మృతుల వివరాలు తెలియరాకపోవడంతో మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోషల్‌మీడియాలో మృతుల ఫొటోలు వైరల్‌ కావడంతో వీరు పోరుమామిళ్ల పట్టణం శ్రీరామనగర్‌ కాలనీకి చెందిన బళ్లారి రామకృష్ణ (43), అనూష (35) దంపతులు తమ పిల్లలు నిఖిల్‌ (4), కల్యాణ్‌ (నాలుగు నెలలు)గా తెలిసింది. దీంతో పోలీసులు రామకృష్ణ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.

గురువారం మధ్యాహ్నం రామకృష్ణ, స్వరూప దంపతులు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయారని, అప్పటినుంచి వారి సమాచారం తమకు తెలియలేదని రామకృష్ణ తండ్రి పోలీసులకు చెప్పాడు. సోషల్‌మీడియాలో వారి ఫోటోలు చూసి తమవారేనని తెలుసుకున్నామని తెలిపాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రామకృష్ణ అప్పుల పాలు కావడంతోనే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.