యాప్నగరం

అటు షర్మిల.. ఇటు సునీత.. మధ్యలో జగన్!

YS Vivekananda Reddy వర్థంతి సందర్భంగా వైఎస్ షర్మిల పులివెందుల వెళ్తున్నారు. తన బాబాయి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. మరి సీఎం జగన్ కూడా చిన్నాన్న వర్థంతి కార్యక్రమానికి హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 14 Mar 2021, 4:16 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి వర్థంతి రేపు (మార్చి 15). ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పులివెందులలో పర్యటిస్తున్నారు. వివేకానంద రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల వడివడిగా అడుగులేస్తున్నారు. షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం జగన్‌కు ఇష్టం లేదని వైసీపీ కీలక నేత సజ్జల చెప్పిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ys sharmila-jagan-sunitha


జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. జగన్ మాట తప్పారని.. షర్మిలకు పదవి ఇవ్వకపోవడంతోనే ఆమె పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందులకు జగన్ వెళ్తే.. షర్మిలతో మాట్లాడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఒక వేళ జగన్ వెళ్లకపోతే అది మరో రకంగా ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2019 మార్చిలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకానంద హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. జగన్ అధికారంలోకి వచ్చినా ఈ కేసు కొలిక్కి రాలేదు. దీంతో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తన తండ్రి మర్డర్ కేసు తేల్చడం కోసం ఆమె కేరళకు చెందిన హక్కుల కార్యకర్తతో ఢిల్లీలో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌కు వెళ్తే షర్మిలతో ఇబ్బందికర పరిస్థితి.. వెళ్లకపోతే సొంత చిన్నాన్న వర్థంతి కూడా వెళ్లలేదనే ప్రచారం.. అటు ఓ చెల్లి.. ఇటు మరో చెల్లితో జగన్‌కు క్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ఇటీవలే ఓ వివాహ వేడుకలో షర్మిల, విజయమ్మ, సునీత పాల్గొన్నారు. కానీ జగన్, ఆయన సతీమణి ఈ వేడుకకు వెళ్లలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.