యాప్నగరం

ప్రతి పల్లెకూ పోతా.. కష్టాలు వింటా: వైఎస్ షర్మిల

"రాష్ట్రమంతా తిరుగుతా.. ప్రతి పల్లెకు పోతా.. ప్రతి గడపని తడతా. ప్రజలతో మమేకమై వారి నోటి నుంచి వచ్చే కష్టాలు వింటా.. ప్రభుత్వాన్ని నిలదీస్తా" అని వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని ఇడుపులపాయలో వివరించారు.

Samayam Telugu 19 Oct 2021, 5:29 pm
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రజల కష్టాలు వింటానని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాదయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా మంగళవారం వైఎస్సార్ ఘాట్‌లో ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదని.. అందుకోసమే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
Samayam Telugu వైఎస్ షర్మిల


రాష్ట్రమంతా తిరిగి ప్రతి పల్లెకు పోయి ప్రతి గడపతి తడతామని షర్మిల అన్నారు. ప్రజలతో మమేకమై వారి నోటి నుంచే కష్టాలను వింటామని ఆమె చెప్పారు. ప్రజల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు చేరుకుని.. తొలుత వైఎస్సార్ ఘాట్‌ వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.