యాప్నగరం

Chandrababu ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. ఈసారి వెనక్కు తగ్గేది లేదు: ఏపీ మంత్రులు

Kurnool Rayalaseema Garjana సభలో వికేంద్రీకరణపై ఏపీ మంత్రులు కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు అసలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని.. ఆయనకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. చంద్రబాబు కుప్పంకు చేసింది ఏమీ లేదని.. సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ధతో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం పోరాటం చేస్తామని.. ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Dec 2022, 2:06 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబుకు ఏపీ మంత్రుల ప్రశ్నలు
  • కర్నూలులో హైకోర్టు రావడం ఇష్టం లేదా
  • చంద్రాబు రాయలసీమ ద్రోహీ అంటూ ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kurnool Rayalaseema Garjana
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. కరువు కారణంగా కళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆకాంక్ష.. చంద్రబాబు, ఆయన బంధువులు అభివృద్ధి చెందాలనేది మాత్రమే టీడీపీ ఆకాంక్ష అన్నారు. సీఎం హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే.. వైఎస్సార్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అన్నారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రజలకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేధావులు అధ్యయనం చేసి వాళ్లు సూచించిన మేరకు సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు మంత్రి. వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని.. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయార‌ని.. కుప్పాన్ని అన్ని విధాల సీఎం వైయ‌స్ జగన్‌ అభివృద్ధి చేశారన్నారు. దీనికి ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎన్నిక‌లే నిద‌ర్శ‌మ‌న్నారు.
చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. మూడు రాజధానులు తీసుకురావాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారని.. తమ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో హైకోర్టు తీసుకురాగలదన్నారు.

రాయ‌ల సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అన్నారు మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌. రాయలసీమ వాసులకు మంచి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేశారన్నారు.. కానీ ఆ లోచన చంద్రబాబుకు లేదన్నారు. వికేంద్రీకరణ నిర్ణయంతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం మొదలైందని.. ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రాయలసీమ ప్రాంతానికి ఎవరూ చేయని పనిని సీఎం జగన్ చేశారన్నారు. అమరావతి ఏకైక రాజధానికి తాము ఒప్పుకునేది లేదని.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి తాము మోసపోయేందుకు రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్‌ ముందకెళ్తున్నారన్నారు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఎవరైనా వస్తే వారికి చెప్పులు, చీపుర్లతో బుద్ధి చెప్పాలన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.