యాప్నగరం

ఆదోని: వంట చేస్తుండగా కాలికి చుట్టుకున్న పాము, ఇంట్లో వెతికితే.. షాక్!

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ మహిళా లెక్చరర్ ఇంట్లో గుట్టల కొద్దీ పాములు బయటపడ్డాయి.

Samayam Telugu 24 Mar 2021, 11:19 pm
పామును చూస్తేనే చూస్తే చాలు చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి తాను ఉంటున్న ఇంట్లోనే పదుల సంఖ్యలో పాములు కంటి ముందు కనిపిస్తే! చీమల పుట్ట బద్ధలైనట్లు పాములు గుంపులుగా దర్శనమిస్తే? బాబోయ్, వినడానికే భయంగా ఉంది కదా..! అలాంటిది ఓ ఇంట్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 పాములు ఒకే చోట బయటపడ్డాయి.
Samayam Telugu ఆదోనిలో లెక్చరర్ ఇంట్లో బయటపడ్డ పాములు


అందులోనూ ఏదో పాడుబడ్డ ఇంట్లోనో.. బావిలోనో అనుకోకుంటే పొరపాటే! ఓ మహిళా లెక్చరర్ ఇంట్లో ఈ పాముల పుట్ట బయటపడింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హసీనా అనే మహిళ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆదోని పట్టణంలోని ఎస్‌కేడీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం ఎప్పటి మాదిరిగానే హసీనా తన ఇంట్లో వంట చేస్తుండగా రెండు పాము పిల్లలు ఆమె కాళ్లకు చుట్టుకున్నాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన హసీనా వెంటనే బయటకు పరుగులు తీశారు.

తర్వాత స్థానికుల సాయంతో ఇంట్లో వెతకగా.. ఒకే ప్రదేశంలో దాదాపు 60 పాము పిల్లలను గుర్తించారు. అయితే, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నది తెలియలేదు. అయితే, ఇంటి చుట్టూ అపరిశ్రుభత నెలకొందని.. దాన్ని శుభ్రం చేయాలని పురపాలక సిబ్బంది, సచివాలయ కార్యదర్శికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని హసీనా వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో చెత్తాచెదారం తొలగించాలని కోరారు. లెక్చరర్ ఇంట్లో ఒకేసారి 60 పాము పిల్లలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.