యాప్నగరం

కర్నూలుజిల్లావాసులకు శుభవార్త.. ఓర్వకల్లు నుంచి విమాన సర్వీసులు, ఎప్పుడంటే!

ప్రయాణికుల టెర్మినల్‌ బిల్డింగ్‌, రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌లో సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే సమావేశంలో కర్నూలు నుంచి ఏఏ ప్రాంతాలకు విమానాలను నడిపేది ప్రకటిస్తామన్నారు.

Samayam Telugu 22 Jan 2021, 7:32 am
కర్నూలు జిల్లావాసులకు శుభవార్త. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి త్వరలోనే సర్వీసుల ప్రారంభంకానున్నాయి. గురువారం ఇండిగో ప్రతినిధుల బృందం ఎయిర్‌పోర్టును పరిశీలించింది. అక్షయ్‌ సుబ్బరామ్‌, రాహుల్‌ బజాజ్‌, రాంబాబు, మెహతా టీమ్.. ప్రయాణికుల టెర్మినల్‌ బిల్డింగ్‌, రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌లో సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే సమావేశంలో కర్నూలు నుంచి ఏఏ ప్రాంతాలకు విమానాలను నడిపేది ప్రకటిస్తామన్నారు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏఐటీఏ కోడ్‌ కేజేబీ అని ప్రతిపాదించినట్లు వివరించారు. మార్చిలో విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
Samayam Telugu కర్నూలు విమానాలు


కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం 2019లో ప్రారంభించారు. కేవలం ఏడాదిన్నరలోనే రూ.110 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. 1010 వేల ఎకరాల విస్తీర్ణంలో 2వేల మీటర్ల పొడవు రన్‌వేను నిర్మించారు. నాలుగు యాఫ్రాన్‌లు సిద్ధం చేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ ఆపరేషన్‌కు సంబంధించిన అనుమతుల గురించి మంత్రి బుగ్గన కేంద్రంతో మాట్లాడారు. ఇండిగో ప్రతినిధులు కూడా విమానాశ్రయాన్ని పరిశీలించారు. మార్చిలో సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.