ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే ఊహించని ప్రమాదంతో పరిస్థితి మారిపోయింది. వారి జీవితాన్ని విధి తలకిందులు చేసింది. కానీ యువతి మాత్రం మంచి నిర్ణయం తీసుకుంది. ఆళ్లగడ్డ రామదాసు వీధికి చెందిన అనిల్.. లక్ష్మీపురం వీధికి చెందిన పవిత్ర ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. 2016లో అనిల్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో రెండు కాళ్లు సచ్చుబడి పోయాయి. ఇక నడవలేడని వైద్యులు తేల్చారు. ఇంటి దగ్గరే మంచానికే పరిమితమయ్యారు. ఈ ఘటన జరగకముందే ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ ఊహించని ప్రమాదంతో ఆశలు తలకిందులయ్యాయి. అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు.. పెళ్లి చేసుకుంటే కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. అబ్బాయి కూడా అమ్మాయిని నిరాకరించాడు. అయినా ఆమె పట్టుదల వీడలేదు. ప్రేమించిన వ్యక్తితోనే కలిసీ బతకాలని తలంచింది. ఒకవేళ అదే ప్రమాదం తనకు జరిగి ఉంటే వదిలేసేవాడివా అని అబ్బాయిని ప్రశ్నించింది. ఇంట్లో తల్లిదండ్రులను ఎదురించి ఈ నెల 2న పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు.
అబ్బాయితోనే కలిసి బతుకుతానని చస్తే అతడితోనే చస్తానని తెగేసి అమ్మాయి చెప్పడంతో తల్లిదండ్రులు వెనక్కు వెళ్లారు. దీంతో ఇరువురు ఈ నెల 8న సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. టీటీసీ పూర్తి చేసిన అమ్మాయి ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కష్టపడి భర్త అనిల్‌ను పోషించుకుంటానని చెబుతోంది పవిత్ర. నడవలేని భర్తకు తాను కాళ్లవుతానని అంటోంది.