యాప్నగరం

చిచ్చురేపిన ప్రేమపెళ్లి... రణరంగంగా మారిన ఊరు, పోలీసుల కళ్లల్లో కారం చల్లి మరీ

పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో పగిడిరాయికి చెందిన యువతీ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 25 May 2021, 10:49 am

ప్రధానాంశాలు:

  • చిచ్చురేపిన ప్రేమ వివాహం
  • యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన అమ్మాయి ఫ్యామిలీ
  • పోలీసులపైనా దాడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
ప్రేమ వివాహం ఓ గ్రామంలో అలజడి రేపింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనా స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.
Also Read: సామర్లకోట: డీఎస్పీగా మారిన డ్రైవర్.. వాళ్లే టార్గెట్, 70కి పైగా కేసులు

దీంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అతడి సామాజిక వర్గానికి చెందిన మరో ఆరు ఇళ్లపై దాడి చేశారు. ఇంట్లోని సామాగ్రినంతా బూడిద చేసి, నాలుగు ఆటోలకు కూడా నిప్పు పెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని అమ్మాయి తరపు బంధువులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన వారు పోలీసులపైనే దాడికి యత్నించి కళ్లల్లో కారం చల్లారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా బలగాలను అక్కడికి పంపించారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న బలగాలు విధ్వంసకారులను నిలువరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మరోవైపు ఈ ఘటనతో భయాందోళనకు గురైన యువకుడి కుటుంబసభ్యులు గ్రామం విడిచి వెళ్లిపోయారు.

Also Read: రూ.లక్షకే కేజీ బంగారం.. ఎగబడిన జనం, ఆఖర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.